Monday, January 20, 2025

నన్ను ఆదుకున్న నా తండ్రి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నాలాంటి అభాగ్యులకు అండదండ ఆయనే
దళితబంధు లబ్ధిదారు రత్నమ్మ భావోద్వేగం

మనతెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి: సూర్యాపేట సభలో దళితబంధు లబ్ధిదారు చింతలచెర్ల రత్నమ్మ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆలోచనలో పడేశాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు తీసుకొచ్చిన ఉద్దేశానికి ఆమె జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన రత్నమ్మ తన కుటుంబంలో అనాధిగా వస్తున్న చెప్పులు కు ట్టుకునే వృత్తిని కొనసాగిస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. పేదరికానికి తోడు కుల వివక్ష మరింత కుంగతీసింది. ఇక తన జీవితం ఇంతే అనుకున్న రత్నమ్మ జీవితంలో దళిత బంధు సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి చేతుల మీదుగా దళిత బంధు తీసుకున్న సందర్భం గా ఉద్వేగ భరితంగా మాట్లాడిన రత్నమ్మ మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నా యి. ఆర్థిక సహాయం కోసం గత పాలకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలించలేదు. పది వేల కోసం ఎంతో మంది నాయకుల చు ట్టూ తిరిగాను. ఆదుకోకపోగా మాదిగ కు టుంబానికి చెందిన తనను హీనమైన చూపు చూసేవారు. 20 ఏళ్లుగా సూర్యాపేటలో ఖ మ్మం క్రాస్ రోడ్డులో చెప్పులు కుట్టుకుంటు న్న నాకు మంత్రి అంటే వినడమే తప్ప ఎలా ఉంటారో తెలియదు. అడగకుండానే దళిత బంధు ద్వారా పది లక్షలు ఇచ్చి బానిసత్వం నుంచి విముక్తి కల్పించారు.

ఇచ్చిన డబ్బులతో చెప్పుల షాపు పెట్టుకుని నా కుమారులను ఉన్నత చదువులు చదివిస్తాను. మంత్రి జగదీష్‌రెడ్డి, ము ఖ్యమంత్రి కెసిఆర్‌లకు రుణపడి ఉంటాను. నా బతుకు జీవితాంతం రోడ్డు పైనే అనుకున్నాను. ఎన్నిసార్లు అడిగినా గతంలో పాలించిన నాయకులు ఎవరు ఆదుకోలేదు. అడగకుండానే ఆదుకున్న మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు. పేదల కష్టాలు తెలిసిన నాయకుడు కెసిఆర్ అని కన్నీటి పర్యంతమైంది. అక్కడే ఉన్న మంత్రి కెటిఆర్ రత్నమ్మను ఓదార్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News