Monday, November 25, 2024

ఆదివాసి జాతి కోసమే నా పోరాటం : సోయం బాపురావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆదివాసి జాతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తనపై లేని పోనివి వక్రీకరించి తుడుం దెబ్బ నాయకులు నిందారోపణలు చేయడం శోచనీయమని బిజెపి పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సమావేశాలను వదిలి పెట్టి తాను కేస్లాపూర్‌లో జరిగిన ఆదివాసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. జాతి కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడుతుంటే తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆందోళన చేయడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు.ఆదివాసీ మహిళలంటే తనకు దేవుళ్ళతో సమానమని, ఆడపడుచులను సోదరీమణులాగా, తల్లిలాగా భావిస్తానని ఎంపి అన్నారు. ఆదివాసి మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని తాను చెప్పడం జరిగిందని, మహిళలు వేరే విధంగా భావిస్తే తాను క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధమేనని అన్నారు. ఎందరు కుట్రలు పన్నినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని, తాను మాత్రం మహిళా జాతికి ఎప్పుడు రుణపడి ఉంటానని వేరే విధంగా భావించకూడదని ఎంపి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News