Wednesday, January 22, 2025

భారత్‌కు టి20 వరల్డ్‌కప్ అందిస్తా: కార్తీక్

- Advertisement -
- Advertisement -

My goal is to win T20 World Cup 2022: Dinesh Karthik

ముంబై : ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించడమే తన అంతిమ లక్ష్యమని టీమిండియా సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ తెలిపాడు. కాగా, కార్తీక్ గడిచిన ఐపిఎల్ నుంచి మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌కు విజయాలు అందిచడంలో కీలక భూమిక పోషిస్తున్నాడు. ఇక కార్తీక్ కేరీర్ ఇదే అత్యుత్తమ ఫామ్‌గా పలువురు కొనియాడుతున్నారు. అంతేకాదు ఇటీవలె విండీస్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా విజయంలో కార్తీక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే 41 పరుగులు సాధించి మరోసారి ఫినిషర్ ప్రశంసలు పొందాడు. తాజాగా బిసిసిఐ టీవీతో కార్తీక్ మాట్లాడుతూ.. ‘భారత్ అన్ని జట్ల కంటే విభిన్నమైంది. ఇటువంటి జట్టులో నేనుండటం చాలా ఆనందం. అయితే టి20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి, భారత్‌కు కప్ అందిచడమే నా లక్ష్యం’ అని పేర్కొన్నాడు.

My goal is to win T20 World Cup 2022: Dinesh Karthik

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News