Saturday, December 21, 2024

మా తాత జోగినపల్లి కేశవరావు స్వాతంత్య్ర పోరాటానికి గర్వపడుతున్నా

- Advertisement -
- Advertisement -
ట్విట్టర్ వేదిక వెల్లడించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో అణచివేత పాలనకు వ్యతిరేకంగా తన తాత జోగినపల్లి కేశవరావు, ఆయనతో పాటు లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాన్ని తలచుకుని గర్వపడుతున్నానని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణలో నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రానికి ఆనాడు వారు చేసిన పోరాటమే కారణమని గుర్తు చేశారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు బాటలు వేసిన స్వాతంత్య్ర సమరయోధులందరికీ ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా నివాళులర్పించారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్న చిరస్మరణీయమైన దినమని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News