- Advertisement -
న్యూఢిల్లీ : తన గొంతే తీవ్రస్థాయిలో ఉంటుందని, దీనిని ఇతరులపై కోపంగా భావించరాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో సభ్యుల నవ్వుల మధ్య చెప్పారు. భారతీయ శిక్షాస్మృతీ చట్టం సవరణలపై లోక్‌సభలో జరిగిన చర్చకు హోం మంత్రి సమాధానం ఇచ్చారు. తన గొంతు బిగ్గరగా లేదా బొంగురుగా ఉంటుంది. అయితే ఇది ఎదుటి వారిపై కోపంతో అరుస్తున్నట్లుగా ఉంటే తన తప్పేమీ లేదని, దీనిని ప్రత్యేకించి ప్రతిపక్ష సోదరులు గుర్తించాలని కోరారు. ఇదంతా కూడా స్వరపేటికలోని యాంత్రిక లోపం అన్నారు. ఇక ఈ చట్టసవరణ విషయానికి వస్తే తీవ్రస్థాయి కేసుల దర్యాప్తు వేగవంతానికి ఇది దారితీస్తుందన్నారు. సభ ఆమోదానికి ముందుకు వచ్చిందని తెలిపారు.
- Advertisement -