Tuesday, November 5, 2024

కెసిఆర్ వెంటే నా ప్రయాణం: గుత్తా సుఖేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరం
వివాదాలకు అతీతంగానే ఉంటాను
మీడియా చిట్‌చాట్‌లో మండలి ఛైర్మన్ సుఖేందర్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యక్ష రాజకీలయాలకు దూరంగా వుంటానని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి అన్నారు. పార్టీ అధినేత కెసిఆర్‌తోనే నా ప్రయాణం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన గుత్తా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన వైఖరిని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ విధానాలను ఫాలో అవుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్నది నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ ఆదేశాలకనుగుణంగానే పని చేస్తానని అన్నారు.

గౌరవాన్ని తగ్గించుకోను:
వివాదాలకు అతీతంగానే నా రాజకీయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నోరు జారి గౌరవాన్నితగ్గించుకోవద్దన్నదే నా సిద్ధాంతమన్నారు. కమ్యూనిస్టులతో పొత్తు పై కామెంట్ చేయలేనని చెప్పిన గుత్తా కమ్యూనిస్టులతో బిఆర్‌ఎస్ పొత్తు ఉంటే బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ఇరు పార్టీల మధ్య పొత్తు పై చర్చలు జరిగాయి. కానీ పూర్తి సమాచారం నాకు తెలియదన్నారు. ‘మీరు కూడా మంత్రి పదవి కోరుకుంటున్నారా?’ అన్న విలేకరుల ప్రశ్నకు సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ ఎవరైనా మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదని, కానీ తాను మాత్రం ఆశపడటం లేదన్నారు. గవర్నర్, సిఎం మధ్య సంబంధాలపై స్పందిస్తూ పాలన సాఫీగా జరగాలంటే ఇరువురిమధ్య సయోధ్య అవసరమని అన్నారు.

రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా:
నా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, 45 ఏళ్ల వయసులోనే ఎంపి అయ్యానని, ప్రస్తుతం తన వయసు 74 సంవత్సరాలని ఇంకా ఉరుకులు, పరుగులు తీసే పరిస్థితి లేదని గుత్తా స్పష్టం చేశారు. ఉన్నన్ని రోజులు కెసిఆర్ వెంటే ఉంటానన్నారు. బతిమాలే రాజకీయాలు తనకు అవసరం లేదన్న గుత్తా నల్గొండలో అభ్యర్థుల మార్పులపై తనకు సమాచారం లేదన్నారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరతారన్న ప్రచారంపై స్పందిస్తూ ఆయన బిఆర్‌ఎస్‌లో చేరతారని అనుకోవడం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News