Friday, September 20, 2024

‘మీరు అబద్ధాలు వినాలనుకుంటే.. మోడీని చూడండి’

- Advertisement -
- Advertisement -

My name isn't Narendra Modi Says Rahul Gandhi

న్యూఢిల్లీ: అస్సాం రాష్ట్రంలోని కమ్రూప్‌లో బుధవారం జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి ఫైర్ అయ్యారు. ప్రధాని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ మోడీపై సెటైర్లు వేశాడు. “నేను మీకు అబద్ధం చెప్పడానికి ఇక్కడకు రాలేదు. నా పేరు నరేంద్ర మోడీ కాదు. మీరు అస్సాం గురించి, రైతులు గురించి, మీ టివి ఆన్ చేసి, నరేంద్ర మోడీ ముఖం చూసి అతని మాట వినండి. మీకు కావలసినంత ఎక్కువ అబద్ధాలు చెబుతూనే ఉంటారు.”అని గాంధీ అన్నారు. “అస్సాం ఓటర్లకు కాంగ్రెస్ ఐదు హామీలు ఇచ్చింది. మేము బిజెపి కాదు, మేము మా వాగ్దానాలను నెరవేరుస్తాము. అస్సాం మొదటి దశ పోలింగ్ మార్చి 27న జరిగింది.  రెండో దశ పోలింగ్ గురువారం జరుగనుంది. చివరి దశకు పోలింగ్ ఏప్రిల్ 6న జరుగనుంది. మే 2న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించారు.

name isn’t Narendra Modi Says Rahul Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News