Monday, December 23, 2024

గాంధేయం నా మార్గం

- Advertisement -
- Advertisement -

ఉద్యమానికి, పాలనకు మహాత్ముడి బోధనలే స్ఫూర్తి

మనతెలంగాణ/ హైదరాబాద్ : మనది న్యాయపథం.. మ నది ధర్మపథం, సకల జనుల సంక్షేమమే మనకు సమ్మ తం.. సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక కార్యక్రమం శుక్రవారం హెచ్‌ఐసిసిలో కన్నుల పండువగా జరిగింది. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాం స్కృతిక కార్యక్రమా లు దేశ ఔన్నత్యాన్ని చాటు తూ తెలంగాణ ప్రగతికి అద్దం ప ట్టాయి. పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీకుమార్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని సిఎం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించా రు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ… సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించిన గాంధీ చి త్రాన్ని 35 ల క్ష ల మంది విద్యార్థులు, ఇతరు లు చూసి ప్రభావితమయ్యారని తెలిపారు. గాం ధీ చిత్రాన్ని ఈ తరం వారికి పరిచయం చేయ డం సంతోషంగా ఉందన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకోవటం మనందరి బాధ్య త.. స్వాతంత్య్ర సమరయోధుల గొప్పతనం నేటి తరానికి సమగ్రంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచింది. విభిన్న సంస్కృతుల ప్రజలను స్వాతంత్రోద్యమం ఏకతాటిపై నిలిపింది. నేటికీ యా వత్ ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తోంది. గాంధీ మార్గంలోనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. గాంధీజీ చూపించిన అహింసా మార్గంలోనే స్వాతంత్య్రోద్యమం విజయతీరం చేరింది. గాంధీ మా ర్గంలో.. రాజ్యాంగ పరిధి లో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. పోరాటం గమ్యాన్ని ముద్దాడగలిగింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన మాత్రమే అనే అభిప్రాయం ఉం డేది. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినప్పుడు అహింసాయుత ఉద్యమం ద్వారా రాజ్యాంగ పరిధిలో ఉద్యమించి విజయం సాధిస్తామని నేను నిండు మనసుతో స్పష్టంగా ప్రకటించా. మొదట కొందరు నాతో ఏకీభవించలేదు. రాను రాను నేను ఎంచుకున్న మార్గమే సరైందని అంగీకరించి నా వెంట నడిచారు. ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప అహింసా మార్గాన్ని వీడకూడదని నేను నిర్ణయించుకున్నా. ఆ నేపథ్యంలో నుంచి వచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన. స్వా తంత్య్ర పోరాట కాలంలో బ్రిటిష్ పాలనే బాగుందన్న ప్రబుద్ధుల వంటి వారు.. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ ఉండే వారు. వారు తెలంగాణ వద్దు.. సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చాలా చేశారు. మన చిత్తశుద్ధి ముందు వారి ప్రయత్నాలు విఫలం కాక తప్పలేదు. విచిత్రం ఏంటంటే, వాళ్లే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడ్డారు. తెలంగాణ ఉద్యమం ఆదర్శవంతమైనట్టే. తెలంగాణ పరిపాలన కూడా స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణంగానే ఉంది. స్వతంత్ర భారతంలో ఏనాడూ లేని విధంగా వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించుకోగలిగాం. రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతుల కళ్లల్లో వెలుగులు చూస్తున్నాం.
ఏడాదిగా ఉత్సవాలు జరిపాం : శాంతికుమారి
దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, చైతన్య దీప్తిని భావితరాలకు తెలియచేసే గొప్ప ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గతేడాది ఆగస్టు 8న ప్రారంభించి ఏడాదికి పైగా అనేక కార్యక్రమాలను, ఉత్సవాలను జరిపామని వెల్లడించారు. గాంధీ చిత్ర ప్రదర్శన, దాదాపు 2 కోట్ల 40 లక్షల జాతీయ జెండాలను ఉచితంగా ఇంటింటికీ పంపిణీ, ఆగస్టు 26న కోటి 30 లక్షల మొక్కలు నాటడంతో పాటు, ఫ్రీడం పార్కులలో కూడా పెద్ద ఎత్తున మొక్కల నాటడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 3,17,115కు పెరిగింది. అదే విధంగా, 2014లో 5.06 లక్షల కోట్లుగా వున్న జిఎస్‌డిపి నేడు 13.13 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.
ఆకట్టుకున్న నృత్యరీతులు…
రాష్ట్ర సమాచార శాఖ, వారోత్సవాల ముగింపు సందర్భంగా రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ముఖ్యమంత్రి వీక్షించారు. అనంతరం.. రాఘవాచారి బ్రదర్స్ నిర్వహించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే గానంతో సంగీత విభావరి ప్రారంభమైంది. ‘ఇదిగో భద్రాద్రి.. అదిగో చూడండి’ అంటూ ఆలాపనతో పాటు ‘ఎందరో మహానుభావులూ.. అందరీకీ వందనాలూ’ అంటూ సాగిన త్యాగరాజ కీర్తన సభికుల ను ఎంతగానో ఆకట్టుకుంది. సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో రూపొందిన ‘భారతీయ భావన’ అన్న నాట్య రూపకం వీక్షకులను కట్టిపడేసింది. ఇందులో కూచిపూడి, భరత నాట్యం, పేరిణి, మోహినీ అట్టం, ఒడిస్సితో పాటు ఆరు రకాల భారతీయ నృత్యరీతులతో కూడిన ఏక ప్రదర్శన ఇచ్చారు. ఆయాచితం నటేశ్వర శర్మ రాసిన ‘తెలంగాణ అవతరణం తెలంగాణ అవతరణం.. తొలిపొద్దు నవకిరణం.. భరత మాత ఆభరణం’ అంటూ సాగిన నృత్య ప్రదర్శన.. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒకొక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని వర్ణిస్తూ సాగింది. ఈ నృత్య రూపకం సిఎం కెసిఆర్ దార్శనికతను, రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించింది. ‘ సింఫనీ ఆఫ్ ఫ్రీడం’ పేరిట సాగిన పలు వాయిద్యా లతో సాగిన జూగల్బందీ ఆద్యంతం ఆకట్టుకుంది. మంజుల రామస్వామి బృందంచే ప్రదర్శించిన ‘వజ్రోత్సవ హారతి’ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో కళాకారుల నృత్య భంగిమలు చూపరులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకిరణ్ రెడ్డి, తన్నీరు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితారెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస యాదవ్, జి జగదీష్ రెడ్డి, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు సంస్థల చైర్మన్లు, సిఎంఓ అధికార్లు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, ఐఎఎస్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News