- Advertisement -
పెగాసస్ స్పైవేర్ తన ఫోన్‌ను హ్యాక్ చేసిందని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె, ఆమె మీడియా సలహాదారు ఇల్తిజా ముఫ్తీ బుధవారం ఆరోపించారు. ‘నా ఫోన్‌ను పెగాసస్ హ్యాక్ చేసినట్లు ఏపిల్ నుంచి అలర్ట్ సందేశం వచ్చింది. విమర్శకులను, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు భారత ప్రభుత్వం పెగాసస్‌ను నియోగించుకున్నట్లు, సాధికారం ఇచ్చినట్లు సమాచారం’ అని ఇల్తిజా ముఫ్తీ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘తమకు వంత పలకని’ మహిళా నేతలపై బిజెపి గూఢచర్యం సాగిస్తోందని కూడా ఆమె ఆరోపించారు. ‘మేము వారికి వంత పాడం కనుకే మహిళలపై బిజెపి నిస్సిగ్గుగా గూఢచర్యం సాగిస్తోంది. అలా ఎలా దిగజారుతారు?’ అని ఇల్తిజా ముఫ్తీ అన్నారు.
- Advertisement -