Saturday, November 16, 2024

స్టూడెంట్ లీడర్‌గా నా పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది: పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

నేను రైతు బిడ్డను
రైతులకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా
రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మనతెలంగాణ/హైదరాబాద్: స్టూడెంట్ లీడర్‌గా తన పొలిటికల్ కెరీర్ ప్రారంభమైందని, తాను రైతు బిడ్డనని, అందుకే రైతులకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందులో భాగంగానే తన సొంత గ్రామంలో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎంపికయ్యానని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్‌గా, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో స్టేట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు ప్రెసిడెంట్ గా ఎంపిక అయ్యానని ఆయన తెలిపారు.

తన జీవితంలో కో ఆపరేటివ్ మూవ్‌మెంట్ ఒక భాగం అయ్యిందని, స్టూడెంట్ పాలిటిక్స్ తర్వాత రైతు కో ఆపరేటివ్ సంఘాలతో తన జీవితం ముడిపడిందని ఆయన అన్నారు. తాను ప్రపంచంలో ఎన్నో ఐసిఐ మీటింగ్‌లు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యాయని ఆయన తెలిపారు. సహకార క్రెడిట్ , బ్యాంకింగ్ నిర్మాణం అభివృద్ధికి సంబంధించి సోమవారం ఓ హోటల్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక మంత్రి రాజన్న, కొండూరి రవీందర్, భీమ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్‌లో తన సోదరుడు రవీందర్ రావు హోస్ట్ చేసిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. 2005లో రవీందర్ రావు, తాను కో ఆపరేటివ్స్ అయ్యామన్నారు.

దేశంలోని అన్ని కోపరేటివ్స్‌ను పునరుద్ధరించడానికి ప్రధాని మన్మోహన్ సింగ్, సిఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐక్య రాజ్య కమిటీని తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దేశంలో కో ఆపరేటివ్ మూవ్‌మెంట్ బ్రతికిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా దేశంలోని వంద శాతం రైతులకు మేలు జరిగిందని ఆయన తెలిపారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్ల రైతుల రుణాన్ని మాఫీ చేసిందని, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందించామని, రైతులను రక్షించడం కోసం, రైతులను ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని చేపట్టిందన్నారు. తెలంగాణలో రైతుల పండించిన పంటను కో ఆపరేటివ్స్ నుంచి కొనుగోలు చేస్తామన్నారు. దీని ద్వారా తమ గ్రామాల్లో ఉండే కో ఆపరేటివ్స్‌కు గొప్ప ఆర్ధిక సాయం అందుతుందని ఆయన తెలిపారు. ఫెర్టిలైజర్లు, విత్తనాలు వంటి ఏ ఇన్‌ఫుట్ అయినా ప్రభుత్వం కో ఆపరేటివ్స్ ద్వారా అందిస్తుందన్నారు. ప్రతి రైతు కో ఆపరేటివ్ మెంబర్ అయితే ప్రభుత్వం నుంచి లేదా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి లభించే ఆర్థిక సాయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News