Tuesday, November 5, 2024

నన్ను వేధిస్తున్రు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తమపై బిజెపి కుట్ర చేస్తోందని.. ఎలాంటి తప్పు చేయకున్నా నిన్నటి నుంచి విచారణ పేరుతో ఇబ్బంది పెడుతోందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ఐటి దాడులు జరుగుతున్నాయని అభిప్రా యపడ్డారు. తాము పేద పిల్లలకు చదువులు చెప్పించడం తప్పా అని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే నామీద, నా బంధువుల మీద ఐటి రైడ్స్ చేయిస్తోంది. రైడ్స్ పేరుతో అధికారులు నా కొడుకును వేధించారు. నా కొడుకుని ఐటీ అధికారులు కొట్టారు.. అందుకే ఆస్పత్రి పాలయ్యాడు. కాలేజీలు పెట్టి సేవ చేస్తున్నాం.. ఎలాంటి దొంగ వ్యాపారాలు చేయట్లేదు.. క్యాసినోలు నడిపించట్లేదు. దందాలు చేయట్లేదు. కావాలనే నాపై ఐటి దాడులు చేస్తున్నారు.

ఒక మంత్రి మీద 200 మంది ఐటీ అధికారులతో దాడులు చేసి భయపెడతారా? ఐటి అధికారుల మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గతంలో కూడా తమ సంస్థలపై ఐటి సోదాలు జరిగిన విషయాన్ని మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు. కానీ ఏనాడు కూడా ఇలా సోదాలు చేయలేదన్నారు. కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని ఆయన కేంద్రంపై మండిపడ్డారు. తాము పేదలకు సేవలు చేస్తున్నట్టుగా మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తాను లీగల్ గానే వ్యాపారాలు చేస్తున్నట్టుగా మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మల్లారెడ్డి ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు.

తమ కుమారుడిని చూడనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటి అధికారులు తమపై కక్ష సాధిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు . తన కుమారుడిని కొట్టినందువల్ల ఆయన ఆసుపత్రిలో చేరారన్నారు. ఆయన్ని చూసేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూరారం ఆసుపత్రి వద్దకు వచ్చిన తన అనుచరులను వెళ్లిపోవాలని మల్లారెడ్డి కోరారు. హాస్పిటల్ ముందు సిఆర్‌పిఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. దాంతో మల్లారెడ్డి ఐటీ అధికారుల తీరుపై తీవ్రంగా ద్వజమెత్తారు. రాజకీయ కక్షతోనే బిజెపి ఈ దాడులకు తెగబడుతోందని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి బుధవారం ఉదయం ఆసుపత్రిలో చేరారు. చాతీలో నొప్పి రావడంతో సూరారం ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని మీడియాలో చూసిన మల్లారెడ్డి ఆందోళనతో ఆసుపత్రికి బయల్దేరారు. మల్లారెడ్డిని ఐటి అధికారులు అడ్డుకున్నారు. ఐటి సోదాలు జరుగుతున్న ఈ టైంలో వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. దీంతో వారిపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడికి బాగాలేదంటే చూసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎవరు అడ్డువచ్చినా తాను మాత్రం ఆసుపత్రిలో ఉన్న తన కుమారుడిని చూసే తీరుతానంటూ చెప్పుకొచారు.

కుమారుడికి బాగాలేదంటే చూసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. తన కుమారుడిని రాత్రంతా ఇబ్బంది పెట్టారని అందుకే ఆయన ఆసుపత్రిలో చేరారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే వెళ్లకుండా అడ్డుకోవడం ఇదెక్కడి దుర్మార్గమని ప్రశ్నించారు. ఆసుపత్రికి వెళ్లేందుకు మల్లారెడ్డి ప్రయత్నాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు ఐటీ అధికారులు. ఆయన కాన్వాయ్ తాళాలు తీసుకున్నారు. అందరి ఫోన్లు లాక్కున్నారు. వెళ్లేందుకు వీళ్లేదని చెప్పడంతో వారితో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News