Friday, January 24, 2025

అందరి సహకారం ఉంటేనే నా కొడుకు బతుకుతాడు: శ్రీతేజ్ తండ్రి భాస్కర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఆస్పత్రి నుంచి శ్రీతేజ్ డిచ్ఛార్జ్ అయ్యేవరకు తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ సపోర్టు కావాలని సంధ్య థియేటర్ సంఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అన్నారు. ఆస్పత్రిలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్ కోలుకునే వరకు కొంచెం సమయంపడుతుందని, నెల నుంచి రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని తెలిపారు. శ్రీతేజ్ కళ్లు తెరుస్తున్నాడు, మూస్తున్నాడని, కొంచెం సమయం తర్వాత కోలుకుంటాడని తెలిపారు. శ్రీతేజ్ గాయపడి ఆస్పత్రిలో చేరిన రెండో రోజు నుంచి అల్లు అర్జున్ ససాయం చేస్తున్నాడని తెలిపారు.

తమ సమయం మంచిగా లేదని, అందుకే తన భార్య మృతి చెందిందని, కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని అన్నారు. గేట్ ఓపెన్ చేయడంతో సంఘటన జరిగిందని, చాలామంది ఉండడంతో తన కూతురితో కలిసి గేట్ పక్కకి వెళ్లాలని, రేవతి, శ్రీతేజ్ మరో వైపు వెళ్లారని తెలిపారు. అక్కడ ఉన్న వారు వెళ్లిపోయిన తర్వాత లోపలికి వెళ్దామని అనుకున్నామని తెలిపారు. అక్కడికి వచ్చిన వారిని కంట్రోల్ చేస్తే ఇలా జరిగేదని కాదని తెలిపారు. అమ్మ గ్రామానికి వెళ్లిందని తన కూతురుకు చెబుతున్నానని, సంఘటన జరిగిన రోజునుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News