Sunday, January 19, 2025

బీజేపీకే నా సపోర్ట్: ఎంపి సుమలత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతుపై మాండ్య లోక్‌సభ ఇండిపెండెంట్ ఎంపీ సుమలత అంబరీష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతు బీజేపీకే ఉంటుందని చెప్పారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సుమలత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక నుంచి బీజేపీకే తన మద్దతు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక నుంచి నా సంపూర్ణ మద్దతు బీజేపీకే ఉంటుంది.

మాండ్య నియోజకవర్గం అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చాను. నా నిర్ణయం వల్ల ఎదురయ్యే పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుని రిస్క్ చేసి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాను” అని సుమలత అంబరీష్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని, ఆయన నాయకత్వంలో దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుందని అన్నారు. నేను భారతీయురాలిని అని ఇవాళ గర్వంగా తలెత్తుకుని ఇతర దేశాల్లో తిరగగలుగుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బ్మొ, బీఎస్ యడియూరప్ప ఎప్పుడూ తనకు మద్దతుగా నిలిచారని గుర్తుచేసుకున్నారు.

ప్రధాని రాకకు రెండు రోజుల ముందే…

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సుమలత పలు విడతలు చర్చలు జరిపినట్టు ముఖ్యమంత్రి బసవరాజ్ బ్మొ శుక్రవారంనాడు తెలియజేసిన నేపథ్యంలో బీజేపీకే తన మద్దతు ఉంటుందని సుమలతా అంబరీష్ ప్రకటించారు. దీనికితోడు, ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12న మాండ్యలో పర్యటించనున్న నేపథ్యంలో దీనికి రెండు రోజుల ముందే సుమలత తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. బలాబలాల పరంగా చూసినప్పుడు, మాండ్య నియోకవర్గం జేడీ(ఎస్)కు కంటుకోటగా ఉంది. 2018 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలోని మొత్తం 7 సీట్లలోనూ జేడీఎస్ గెలుపొందింది. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నియోజవర్గం నుంచి సుమలత ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందడం ద్వారా జేడీఎస్‌కు షాకిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News