Monday, December 23, 2024

మా మావయ్యను నరమాంస భక్షకులు తిన్నారు: బైడెన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపాడు. తడబడడంతో మళ్లీ ఆయనకు జ్ఞాపకశక్తి మందగించిందని సందేహాలు తలెత్తుతున్నాయి. బుధవారం పిట్స్ బర్గ్‌లో ఆయన మాట్లాడారు. తన మావయ్య సెకండ లెఫ్టినెంట్ ఆంబ్రోస్ జె పినెగన్ జూనియర్‌ను పపువా న్యూగినియాలో నరమాంస భక్షకులు తినేశారని చెప్పుకొచ్చారు. న్యూగినియాలో చాలా మంది నరమాసం భక్షకులు ఉండేవారని పేర్కొన్నారు.  రెండు ప్రపంచ యుద్ధం సమయంలో విమానం ప్రమాదంలో ఆంబ్రోస్‌తో మరో ఇద్దరు న్యూగినియాలో చనిపోయారని అమెరికా సైనికుల రికార్డులో ఉంది. వాళ్ల మృతదేహాలను అమెరికా సైనికులు అప్పట్లో గురించలేకపోయారు. జో బైడెన్ మతి మరుపు ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో మతి మరుపుతో కొన్ని సార్లు తప్పుగా మాట్లాడారని వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News