Monday, December 23, 2024

25న నా పెళ్లి….నేను జైలుకు వెళ్లను

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: గంజాయి కేసులో అరెస్టయిన ఓ నిందితుడు నాంపల్లి కోర్టులో గురువారం హంగామా సృష్టించారు. తనకు పెళ్లి కుదిరిందని, జైలుకు వెళన్లని గొడవ గొడవ చేశాడు. కో ర్టు లోపల ఉన్న అద్దాలను పగులగొట్టడంతో నిందితుడి చేతికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం… ఆనంద్ అగర్వాల్ గంజాయి విక్రయిస్తుండడంతో శాలిబండ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే నిందితుడిపై 18కేసులు ఉన్నాయి. పోలీసులు గతంలోనే రౌడీషీట్ ఓపెన్ చేశారు. గంజాయి కేసులో అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. విచారణ తర్వాత కోర్టు ఆ నంద్ అగర్వాల్‌కు రిమాండ్ విధించింది. దీంతో తనకు పెళ్లి కుదిరిందని, ఈ నెల 25వ తేదీన వివాహం ఉందని తాను జైలుకు వెళ్లనని మొండికేశాడు. పోలీసులు తక్కడి నుంచి తరలించేందుకు యత్నించగా కోర్టు లోపల ఉన్న డోర్ అద్దాలను ధ్వంసం చేశాడు. నిందితుడు అగర్వాల్‌పై గతంలో కూడా పలు గంజాయి కేసులు, ఓ మర్డర్, దొంగతనం కేసు పోలీసులు నమోదు చేశారు. నెల రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి ఇటీవల విడుదలయ్యాడు. నిందితుడిని అక్కడి నుంచి జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News