Tuesday, October 1, 2024

నా భార్య విద్వేష రాజకీయాల బాధితురాలు: సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

ఇది ఇలా ఉండగా, ముడా తనకు కేటాయించిన 16 ప్లాట్ల యాజమాన్యాన్ని, స్వాధీనాన్ని వదలుకోవాలని నిర్ణయించిన తన భార్య పార్వతి బిఎం తన (సిఎం)పై గల ‘విద్వేష రాజకీయాల’ బాధితురాలు అని, ఆమె నిర్ణయానికి తాను ఆశ్చర్యపోయానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. పార్వతి తన కుటుంబానకే పరిమితమైనట్లు, కానీ విద్వేష రాజకీయాలో ఆమె ‘మానసిక చిత్రవధకు గురైనట్లు’ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు ఫిర్యాదు సృష్టించాయన్నది, తనపై రాజకీయ ద్వేషాన్ని కలిగించేందుకు ఈ వివాదంలోకి తన కుటుంబాన్ని లాగాయన్నది రాష్ట్ర ప్రజలకు తెలుసునని సిద్ధరామయ్య చెప్పారు.

‘ఈ అన్యాయానికి తలొగ్గకుండా పోరాడాలన్నది నా వైఖరి, కానీ నాపై సాగుతున్న రాజకీయ కుట్రతో నొచ్చుకుని నా భార్య ఆ స్థలాలు వాపసుకు నిర్ణయం తీసుకున్నది, అది నన్నూ ఆశ్చర్యపరచింది’ అని ఆయన తెలియజేశారు. ‘నా నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోని, తన కుటుంబానికే పరిమితమైన నా భార్య నాపై విద్వేష రాజకీయాల బాధితురాలు, మానసిక చిత్రవధకు గురవుతోంది. నేను ఆవేదన చెందాను. అయితే, ప్లాట్లు తిరిగి ఇచ్చేయాలన్న నా భార్య నిర్ణయాన్ని గౌరవిస్తాను’ అని సిద్ధరామయ్య చెప్పారు. ముడా వినియోగించుకుంటున్న తన 3.16 ఎకరాల భూమికి పరిహారంగా తనకు కేటాయించిన 14 స్థలాలను వదులుకోవాలన్న తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ పార్వతి సోమవారం ముడాకు ఒక లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News