Monday, December 23, 2024

సూకీకి మరో ఏడేళ్ల జైలుశిక్ష!

- Advertisement -
- Advertisement -

నైపిడావ్: మయన్మార్‌లో నేతగా పదవీచ్యుతురాలైన ఆంగ్‌సాన్ సూకీకి సంబంధించిన ఐదు అవినీతి కేసుల్లో అంతా కలిపి ఏడేళ్ల జైలుశిక్షను మిలిటరీ కోర్టు శుక్రవారం విధించింది. పాత కేసులను తిరగదోడి ఈ పొడగింపు శిక్షను విధించారని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. కోర్టు విచారణ రహస్యంగా జరిగింది. ఆంగ్‌సాన్ సూకీని 2021 ఫిబ్రవరిలో తిరుగుబాటు జరిగినప్పుడు అరెస్టు చేశారు. మయన్మార్ నాయకురాలుగా ఉన్నప్పుడు ఆమె హెలికాప్టర్‌ను లీజుకు తీసుకున్న కేసులో నేరస్తురాలుగా ఈ శిక్ష విధించారని తెలుస్తోంది.

నోబెల్ ప్రైజ్ విజేత అయిన ఆంగ్‌సాన్ సూకీ మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా పోరాటం చేశారు.ఆమె తన రాజకీయ జీవితంలో చాలా వరకు జైలులోనే గడిపారు. మయన్మార్‌లోని మిలిటరీ ప్రభుత్వం ఆమెను వివిధ కేసుల్లో జైలు ఉంచింది. జడ్జీ ఆమె మరో ఏడేళ్లు జైలులో గడిపేలా తాజాగా శుక్రవారం శిక్ష విధించారు. ఆమె మీద ఉన్న ఐదు అభియోగాలకు గరిష్ఠంగా 15 ఏళ్లు జైలు శిక్షపడాల్సి ఉంది.

సూకీ 2015 నుంచి మయన్మార్‌లో ఐదేళ్ల పాటు ప్రజాస్వామికంగా పాలన చేశారు. అది వరకు ఉన్న 49 ఏళ్ల మిలిటరీ పాలనకు మంగళం పాడారు. ఆమెను అనేక కేసుల్లో ఇరికించారు. కొవిడ్19 ఆంక్షలు ఉల్లంఘించి ప్రచారం చేయడం, అక్రమంగా రేడియో పరికరం కలిగి ఉండడం, రెచ్చగొట్టడం, ప్రభుత్వ రహస్య చట్టాన్ని ఉల్లంఘించడం, దేశ ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం వంటి వివిధ రకాల నేరాభియోగాలను ఆమెపై సైనిక ప్రభుత్వం మోపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News