ఒక పక్క అంతర్యుద్ధం, మరో పక్క భారీ భూకంపంతో కుదేలవుతున్న మయన్మార్ లో పరిస్థితి దారుణంగా ఉంది. దేశం అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భూకంపం కారణంగా 2,719 మందికి పైగా చనిపోయారు. 4,521 మందికి పైగా గాయపడ్డారు. మరో 441 మంది జాడ తెలియడం లేదు.మయన్మార్ వ్యాప్తంగా దాదాపు 10 వేల భవనాలు నేలమట్టం అయ్యాయని చెబుతున్నారు. శిథిలాలకింద ఇంకా ఎంతమంది మరణించారో అనిభయపడుతున్నారు.మృత్యుంజయులు.. భూకంపం కారణంగా కుప్పకూలిన భవనాల శిథిలాలనుంచి రిస్క్యూ బృందాలు పలువురిని రక్షిస్తున్నారు. మయన్మార్ రాజధానిలో శిథిలాల కింద నుంచి 63 ఏళ్ల మహిళను రక్షించారు. భారీ భూకంపం దేశాన్ని కుదిపేసిన 91 గంటలతర్వాత ఆ మహిళ సురక్షితంగాబయటపడింది. భూకంపం కారణంగా కూలిపోయిన అతి పెద్ద అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ స్కై విల్లా శిథిలాల నుంచి చైనా రిస్క్యూ బృందం నలుగురిని రక్షించిందని మయన్మార్ సైనిక అధికార గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ వెల్లడించింది. వారిలో ఐదేళ్ల చిన్నారి,ఓ గర్భిణీ స్త్రీ కుడా ఉన్నారట.
60 గంటల పాటు శిథిలాలకింద ఉన్న వారిని రక్షించారు. ఇలాగే పలువురు మృత్యుంజయుల కోసం కూడా గాలిస్తున్నారు. ఇద్దరు టీనేజర్లు, ఒక భవనం శిథిలాలనుంచి బయటపడి, రిస్క్యూ టీమ్ కు ఓ భవనం కింద తమ అమ్మమ్మ, తోబుట్టువులను
గుర్తించినట్లు తెలుపడంతో వారినీ రిస్క్యూ టీమ్ రక్షించింది. మాండలేలో 403 మందిని రిస్క్యూ టీమ్ లురక్షించాయి. 259 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆగ్నిమాపక శాఖ తెలిపింది. ఒక బౌద్ధ మఠం కూలిపోవడంతో అక్కడ మతపరమైన పరీక్షలు రాస్తున్న 50 మందికి పైగా బౌద్ధ సన్యాసులు చనిపోయారు.మరో 150 మంది శిథిలాల కింద సమాధి అయ్యారని భావిస్తున్నారు.భారతదేశం, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, పలు ఆగ్నేయాసియా దేశాల నుంచి అంతర్జాతీయరిస్క్యూ బృందాలు రంగంలో కి దిగాయి. అమెరికా కూడా ఓ బృందాన్ని పంపినట్లు ప్రకటించింది. ఇంకా వారు మయన్మార్ చేరుకోవలసిఉంది.ఇప్పటికే భారతదేశంతో పాటు పలు దేశాలనుంచి ఆహారం, మందులు, ఇతర సహాయక సామగ్రి సాయంగా అందుతున్నాయి. పలు అంతర్జాతీయ దేశాలు మిలియన్ల కొద్దీ సహాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నాయి.
మయన్మార్ లో భారీ భూ కంపానికి ముందే చెలరేగిన అంతర్యుద్ధం కారణంగా 30 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. భూకంప కారణంగా దాదాపు 2 కోట్ల మంది సహాయం అవసరమైన పరిస్థితుల్లో ఉన్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
మయన్మార్ రాజధాని, రెండో అతిపెద్ద నగరం లో ఇళ్లు కుప్పకూలడంతో లక్షలాదిమంది రోడ్ల పై గడుపుతున్నారు. వారికి ఆహారం, మంచినీరు , మందులు కొరత ఉంది.ప్రాధమిక వైద్యం, ప్రామాణిక టీకాలు లేకపోవడం, పారిశుధ్యం లోపించడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సంస్థ హెచ్చరించింది.వేలాది మందిని రద్దీగా ఉండే ఆశ్రయాలకు తరలిస్తున్నారు.లక్షలాది మంది ఒక్కో ప్రాంతంలో ఉండడం వల్ల , వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య బృందాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం మండిపోతున్న ఎండలతో జనం అల్లాడు తున్నారు. త్వరలోవర్షా కాలం రానున్నది ఈ నేపథ్యంలో లక్షలాది మందికి ఆశ్రయం కల్పించడం పెద్ద సమస్యగా మారింది.మయన్మార్ లో అంతర్యుద్ధం కారణంగా విపత్తు సహాయం మరింత కష్టతరం అవుతోంది. 2021లో మయన్మార్ సైన్యం ఆంగ్ సాన్ సూకీ ఆధ్వర్యంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సైన్యానికి తీవ్రమైన ప్రతిఘటన ఎదురు కాగా, అంతర్యుద్ధం మరింత తీవ్రమైంది. భూకంపం కారణంగా దేశం తీవ్ర సంక్షోభాన్నిఎదుర్కొంటుంటే, భూకంప బాధితులకు మానవతా సహాయం నేరుగా అందేలా అంతర్జాతీయ కమ్యునిటీ చూసుకోవాలని, 2021లో పదవికోల్పోయిన ప్రజాప్రతినిధుల కూటమి పిలుపునిచ్చింది. మానవతా సహాయాన్ని సైనిక జుంటా కబళించకుండా చూడాలని, వారి ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.