Friday, April 4, 2025

3085కు పెరిగిన మయన్మార్ భూకంప మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

వారం రోజుల క్రితం మయన్మార్‌లో వచ్చిన భూకంపం తాలూకు మృతుల సంఖ్య 3085కు పెరిగింది. సెర్చ్,రెస్కూ బృందాలు మరిన్ని మృతదేహాలను కనుగొన్నట్లు అక్కడి సైనిక ప్రభుత్వం తెలిపింది. కాగా మానవతా సహాయక బృందాలు బతికి బయటపడిన వారికి వైద్యం, ఆశ్రయం కల్పించడానికి ముందుకు వచ్చాయి. మరి 4715 మంది గాయపడ్డారని, 341 మంది ఆచూకీ లేకుండా పోయారని సైన్యం తెలిపింది. మయన్మార్ రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో 7.7 తీవ్రతతో కూడిన భూకంపం శుక్రవారం సంభవించిందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ భూకంపం అనేక భవనాలను, రోడ్లను, బ్రిడ్జిలను వేర్వేరు ప్రాంతాల్లో ధ్వంసం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఓ) ప్రకారం నాలుగు ఆసుపత్రులు, ఓ హెల్త్ సెంటర్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రోజురోజుకు గాయపడిన రోగుల సంఖ్య ఆసుపత్రుల్లో పెరుగుతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మాండలేలో ఇండియా మొబైల్ హాస్పిటల్, రష్యన్ బెలారష్యన్ సంయుక్త హాస్పిటల్ పనిచేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News