Sunday, January 19, 2025

మిజో ఎయిర్‌పోర్ట్‌లో కూలిన మయన్మార్ విమానం

- Advertisement -
- Advertisement -

8 మందికి గాయాలు
సైనికులను వెనుకకు తీసుకువెళుతున్న మిలిటరీ విమానం
లెంగ్‌పుయి ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై దుర్ఘటన
రెండుగా చీలిన విమానం

ఐజ్వాల్ : ఐజ్వాల్ శివార్లలో మంగళవారం లెంగ్‌పుయి విమానాశ్రయంలో ఒక మయన్మార్ సైనిక విమానం కూలిపోగా ఎనిమిది మంది వ్యక్తులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్రితం వారం భారత సరిహద్దు దాటివచ్చిన మయన్మార్ సైనికులను వెనుకకు తీసుకువెళ్లేందుకు ఆ చిన్న విమానం ఐజ్వాల్‌కు వచ్చిందని, ఒక తిరుగుబాటు వర్గంతో తుపాకుల పోరు అనంతరం ఆ సైనికులు భారత సరిహద్దు దాటి వచ్చారని అధికారులు తెలిపారు.

విమానంలో పైలట్‌తో సహా 14 మంది ఉన్నారని, వారిలో ఎనిమిది మంది ఆ ప్రమాదంలో గాయపడ్డారని అధికారులు వివరించారు. విమానం దిగుతున్నప్పుడు మిజోరామ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని విమానాశ్రయం రన్‌వేపై జారి కూలిపోయిందని, ఆ ప్రమాదం తీవ్రతకు విమానం రెండుగా చీలిపోయిందని వారు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లెంగ్‌పుయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు వారు తెలిపారు. కాగా, ఆ ప్రమాదంపై దర్యాప్తునకు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డిజిసిఎ) ఆదేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ ప్రమాదం దరిమిలా విమానాశ్రయాన్ని వెంటనే మూసివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News