కౌలాలంపూర్: మిలిటరీ పాలకుడు హాజరు కాకుండా తలుపులు మూసేసుకున్నందుకు నిరసనగా మయన్మార్ ఆగ్నేయాసియా దేశాల సంఘం సమావేశాని(ఆసియాన్)కి డుమ్మా కొట్టింది. ఆసియాన్ సమావేశానికి మయన్మార్ ప్రతినిధిగా సీనియర్ జనరల్ మిన్ ఆంగ్‌ను అనుమతించకపోవడంపై మయాన్మార్ ఇలా ప్రతిస్పందించింది. మయన్మార్ మిలిటరీ పాలకులు ఫిబ్రవరిలో ఆంగ్‌సాన్ సూకీని ఫిబ్రవరిలో పదవి నుంచి తొలగించింనందుకు ఆసియాన్ ఆయనకు అనుమతి నిరాకరించింది. 10 దేశాల ఆ సంఘానికి ఈ ఏడాది బ్రూనీ నేతృత్వం వహిస్తోంది. అయితే రాజకీయేతర ప్రతినిధిగా మయన్మార్‌కు చెందిన ;hచాన్ ఆయ్‌ను ఆహ్వానించినప్పటికీ ఆమె ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఈ విషయాన్ని ఇండోనేషియా విదేశాంగ మంత్రి రెంటో మర్సూదీ జకార్తాలో విలేకరులకు చెప్పారు. ఇదిలావుండగా మయన్మార్ సంక్షోభం అన్నది ‘ఆసియాన్’ సమస్యల పరిష్కార సమర్ధతకు ఓ పరీక్ష వంటిదని థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓ చాన్ సమావేశంలో అన్నారు.