Monday, January 20, 2025

దేవినేని ఉమతో వ్యక్తిగత ద్వేషాలు లేవు: వసంత కృష్ణా

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో రెండు రోజుల్లో తాను టిడిపిలో చేరుతానని ఎంఎల్‌ఎ వసంత కృష్ణా ప్రసాద్ తెలిపారు. ఎన్‌టిఆర్ జిల్లా ఐతవరంలో ఎంఎల్‌ఎ వసంత కృష్ణా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలందరినీ కలిసి చంద్రబాబు వద్దకు తీసుకెళ్తానని, దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని, టిడిపి అధిష్ఠానం సమక్షంలోనే దేవినేనితో అన్ని మాట్లాడుకుంటానని వివరణ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్‌ను వ్యక్తిగతంగా దూషించాలని సిఎం జగన్ చెప్పేవారని, మైలవరం టికెట్ ఇస్తామంటూనే వ్యక్తిగత దూషణలు చేయమన్నారని, వైఎస్‌ఆర్‌సిపిలో ఉండలేకే టిడిపిలో చేరుతున్నానని వసంత ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సిపిలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారని సిఎం జగన్ మోహన్ రెడ్డికి చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News