Monday, January 20, 2025

తెలుగులోనూ ‘మై లో’ యాప్ సర్వీసులు..

- Advertisement -
- Advertisement -

Mylo App starts its Services in Telugu

మైలో అనేది కొత్త తల్లులు, కాబోయే తల్లుల(తల్లి కావాలనుకుంటున్న వారు) కోసం ఉద్దేశించబడిన యాప్. ఇది తన సేవలను తెలుగులో కూడా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త లాంగ్వేజ్ ఆప్షన్ ద్వారా కస్టమర్ల సంఖ్య పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కొత్తగా తల్లయ్యే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యాప్ను వాడే వారికి కొత్త అనుభూతిని అందించేందుకు విస్తృత ప్రయత్నాలలో భాగంగా బెంగాలీలో మద్దతు అమలు చేయబడుతోంది..

మై లో (Mylo) యాప్ వ్యవస్థాపకుడు మరియు CEO అయిన వినీత్ గార్గ్ మాట్లాడుతూ… మా వద్ద ఉన్న 10 మిలియన్ల మంది తల్లిదండ్రుల సంఘం నుంచి పొందిన ఇన్పుట్స్ ఆధారంగా.. మా సేవలను అన్ని ప్రాంతీయ భాషల్లోకి విస్తరించాలని నిర్ణయించుకున్నామని, వినియోగదారులు వారి మాతృభాషలో మరింత సుళభంగా విషయాలను అర్థం చేసుకుంటున్నారని గుర్తించినట్లు తెలిపారు. తెలుగు భాషలో యాప్ అనేది.. మొదటి అడుగు మాత్రమే అని, అతి త్వరలో మరిన్ని ప్రాంతీయ భాషల్లో మై లో (Mylo) యాప్ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, యాప్లో తెలుగు మాట్లాడే కమ్యూనిటీ నుంచి మాకు అద్భుతమైన ఫీడ్ బ్యాక్ (అభిప్రాయం) వచ్చిందని తెలిపారు.

ఈ సంవత్సరం చివరి నాటికి ఇండియాలో ఇంటర్నెట్ యూజర్ బేస్ 840 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. కానీ 90శాతం మంది భారతీయ వినియోగదారులు ప్రాంతీయ భాషల్లోని కంటెంట్ను వాడేందుకు ఇష్టపడతారు. అందుకోసమే మై లో (Mylo) భారతదేశం అంతటా ప్రాంతీయ భాషల్లో తల్లుల కొరకు యాప్ లాంచ్ చేయాలని యోచిస్తోంది.

గర్భధారణ లేదా పేరెంటింగ్లో స్త్రీల అనుభవాలు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇతర స్త్రీలతో మై లో (Mylo) యాప్లో ఉన్న కమ్యూనిటీ ఫోరమ్ ద్వారా చర్చించేందుకు వీలు పడుతుంది. వారు మార్గనిర్దేశనం చేసేందుకు వీలుంటుంది. యాప్ అనేది ప్రతి వినియోగదారునికి ఒక కొత్త అనుభూతిని, వారికి అవసరమైన కంటెంట్ను వారి అవసరాలను బట్టి అందజేస్తోంది. బేబీ వీక్లీ ట్రాకర్, పీరియడ్ ట్రాకర్, డైలీ టిప్, ప్రెగ్నెన్సీ ట్రాకర్, పర్సనలైజ్డ్ (వ్యక్తిగత) డైట్ చార్ట్, వంటి ఎన్నో రకాల టూల్స్ ఇందులో ఉన్నాయి. మై లోను (Mylo) వాడుతున్న అందరు తల్లిదండ్రులకు ఈ టూల్స్ సంతోషాన్ని మరియు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంతే కాకుండా ఈ యాప్లో బేబీ, ప్రెగ్నెన్సీ, మెటర్నటీ, పర్సనల్ కేర్, బ్యూటీ వంటి విభాగాలకు చెందిన 100 కంటే ఎక్కువ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

యాప్లో ఉన్న మై లో (Mylo) క్లీనిక్ అనేది వివిధ దశల్లో ఉండి.. తల్లి కావడం కోసం ప్రయత్నిస్తున్న యువతులకు డిజిటల్ హెల్త్ టూల్స్ను అందజేస్తుంది. అంతే కాకుండా వారికి నిపుణులతో సంప్రదింపులను కూడా అందిస్తోంది. నిపుణుల ద్వారా ఆన్లైన్ సంప్రదింపులను పొందొచ్చు. సాంకేతికత ద్వారా ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్, పిడియాట్రిక్స్ (పిల్లల వైద్యం) వుమెన్, చైల్డ్ కేర్(శిశు సంరక్షణ) కు నెక్ట్స్ జెనరేషన్ (తర్వాతి తరం) వర్చువల్ కేర్ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మై లో (Mylo) అనేది దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని భావిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News