Wednesday, January 15, 2025

అంతా సెట్.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా: మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. మైనంపల్లి సోమవారం మీడియాతో మాట్లాడుతూ… సర్వే ఆధారంగా టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారన్నారు. సర్వేలో అనుకూలంగా ఉంటే ఇద్దరికి టికెట్లు ఇస్తామని చెప్పిన విషయాన్ని ఆయన వెల్లడించారు.

నా తరుపున నక్క ప్రభాకర్ కు కూడా మేడ్చల్ టికెట్ అడిగానని చెప్పారు. కాంగ్రెస్ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించారని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని మైనంపల్లి మీడియాతో వెల్లడించారు. ఈ నెల 27లోపు కాంగ్రెస్ చేరతానన్నారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. మెదక్ లో నా కుమారుడికి మంచి ఆదరణ ఉంది. మా కార్యకర్తలను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నాము. తమకు మద్దతుగా నిలిచిన వారిపై కేసులు పెట్టి వేధించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News