Thursday, September 19, 2024

సిద్దిపేటలో హోరాహోరీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో రోజురోజుకూ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్‌ఎస్ మధ్య రచ్చ కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతతుందోనన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో నెలకొంటోంది. సిఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం వందకు వంద శాతం రుణ మాఫీ చేయాలని, లేకుంటే రేవంత్ రెడ్డి పదవి నుంచి తొలగిపోవాలని బిఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుండగా..రుణమాఫీ చేశాం.. హరీష్‌రా వు ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పట్టుపడుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సిద్దిపేటలో భారీ ర్యాలీకి పిలుపునివ్వడంతో రైతు రుణమాఫీపై గ్రామ స్థాయిలో పర్యటనకు బిఆర్‌ఎస్ కార్యాచరణ సమావేశం ఏర్పాటు  చేసింది. దీంతో ఎప్పుడు ఏంజరుగుతుందోనన్న ఆందోళన ప్రతిఒక్కరిలో నెలకొంది.

బిఆర్‌ఎస్ పార్టీ ఆద్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి భారీ సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. కాంగ్రెస్ ర్యాలీకి హైదరాబాద్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంఎల్‌ఎ మైనంపల్లి హనుమంతరావుతో పాటు మెదక్ ఎంఎల్‌ఎ మైనంపల్లి రోహిత్ ప్రత్యేక వాహనాలలో సిద్దిపేటకు చేరుకున్నారు. మార్గమధ్యంలో ఎంఎల్‌ఎ హరీష్‌రావు క్యాంపు కార్యాలయం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించి భారీ గేట్‌లను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ర్యాలీని దారిమళ్లించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎసిపి మధు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తుతో పాటు ప్రత్యేక బలగాలతో పట్టణంలో కవాతు నిర్వహించారు. ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయం నుంచి బిఆర్‌ఎస్ నాయకులు బయటకు వస్తే అల్లర్లు జరుగుతాయని ముందస్తుగా అక్కడే భారీగా పోలీసుల బలగాలతో మోహరించారు. అనంతరం కాంగ్రెస్ ర్యాలీ బిజెఆర్ చౌరాస్తా నుంచి ఎన్సాన్‌పల్లి చౌరాస్తా, భారత్ నగర్ మీదుగా పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుని అక్కడే సభ నిర్వహించారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News