బెంగళూరు: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటకలోని మైసూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చేతన్(45)-రూపాలి(43) అనే దంపతులు మైసూరులోని విశ్వేశ్వరయ్యనగర్‌లో నివసిస్తున్నారు. చేతన తన కుమారుడు, తల్లి ప్రియంవద, రూపాలితో కలిసి ఉంటున్నాడు. చేతన్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చేతన్ తన తల్లి, భార్య, కుమారుడికి విషం ఇచ్చిన అనంతరం అతడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు అమెరికాలో ఉన్న బంధువులకు పోన్ చేసి అప్పుల బాధలు భరించలేకపోతున్నామని, కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికా నుంచి బంధువుల ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో స్థానికంగా బంధువులకు సమాచారం ఇచ్చాడు. వాళ్లు చేతన్ ఇంటికి వెళ్లేసరికి అతడు ఉరేసుకొని కనిపించగా మిగిలిన విగతజీవులుగా కనిపించారు. బంధువుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.