Sunday, January 19, 2025

విజయవాడలో బెంగాలీ విద్యార్థి మృతిపై సిబిఐ దర్యాప్తు కోసం డిమాండ్

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: జబల్‌పూర్ యూనివర్సిటీకి చెందిన ఒక ఫ్రెషర్ మృతిపై రాజకీయ దుమారం రేగుతున్న తరుణంలో విజయవాడలోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన హాస్టల్‌లో బెంగాల్‌కు చెందిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఇదే పరిస్థితిలో మృతి చెందిన ఘటనపై ఆ విద్యార్థి తల్లిదండ్రులు సిబిఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నారు.

తమ కుమారుడి మృతిపై సిబిఐ దర్యాప్తు కోరుతూ ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖలు రాసిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టును కూడా ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.

విజయవాడలోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన హాస్టల్ భవనం 11వ అంతస్తు బాల్కనీ నుంచి తన కుమారుడు పడి మరణించాడని కళాశాల యాజమాన్యం చెబుతోందని, కాని వాస్తవానికి ర్యాగింగ్ కారణంగానే తన కుమారుడు మరణించాడని బాధిత విద్యార్థి తండ్రి ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇంజనీరింగ్ కోసం నేషనల్ జాయింట్ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత సౌరోదీప్ చౌదరికి విజయవాడలోని కెఎల్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింవ కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో అడ్మిషన్ లభించింది. సౌరోదీప్ తండ్రి సుఈప్ చౌదరి పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా మిడ్నాపూర్‌లో హోమియోపతి కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జులై 24న కెఎల్ యూనివర్సిటీ నుంచి తన కుమారుడికి సంబంధించిన ఫోన్ కాల్ వచ్చింది. విద్యార్థుల హాస్టల్ భవనం 11వ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడి మీ కుమారుడు మరనించినట్లు యూనివర్సిటీ అధికారులు ఫోన్‌లో తెలియచేశారు.

హుటాహుటిన విజయవాడ చేరుకున్న సుదీప్ చౌదరికి కుమారుడి మృతదేహం చూస్తే 11వ అంతస్తు నుంచి కిండపడి మరణించినట్లుగా కనిపించలేదు. శరీరంపైన ఎటువంటి గాయాలు కనిపించలేదు. యూనివర్సిటీ అధకారుల ప్రదర్తన కూడా ఆయనకు అనుమానాలు రేకెత్తించే విధంగా కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు కూడా పంపించడానికి యూనివర్సిటీ అధికారులు నిరాకరించినట్లు సుదీప్ చౌదరి తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే విజయవాడలోని తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సుదీప్ చౌదరి సిబిఐ డిమాండ్ కోరుతూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News