Wednesday, March 12, 2025

నటి సౌందర్య మరణం వెనుక మిస్టరీ

- Advertisement -
- Advertisement -

నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 22 ఏళ్ల తర్వాత ఆ ప్రమాదం విషయంలో తాజాగా ఫిర్యాదు దాఖలైంది. చిత్రంగా సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబును పేరును ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి ఆరోపణ ఇండియా టుడే ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దివంగత నటి సౌందర్య దక్షిణాదిలో మోహన్ బాబుతో సహా చాలా మందితో చిత్రాలలో నటించారు. 2004 ఏప్రిల్ 17న ఓ ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి ప్రమాదవశాత్తూ మరణించారు. ఈ ప్రమాదంలో ఆమె సోదరుడు కూడా ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఖమ్మంజిల్లా ఖమ్మం రూరల్ మండలానికి చెందిన సత్యనారాయణ పురం గ్రామానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ ఫిర్యాదు దాఖలు చేశాడని తెలిపింది. ఈ ప్రమాదం వెనుక మోహన్ బాబు ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది.

ఆ ప్రమాదం పై తాజాగా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, ఏమైనా కుట్రకోణం ఉందా అన్నది నిగ్గుతేల్చాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపంది. మంచు మోహన్ బాబు తనను బెదిరించారని ఆరోపిస్తూ, తనకు పోలీసు రక్షణ కావాలని ఆ వ్యక్తి కోరడం మరింత ఆశ్చర్యకరం.శంషాబాద్ మండలం జల్ పల్లిలో సౌందర్యకు ఆరు ఎకరాల లో ఉన్న గెస్ట్ హౌస్ ను తనకు అమ్మవలసిందిగా మోహన్ బాబు కోరినట్లు ఆ వ్యక్తి ఆరోపించాడు. అయితే, దానిని అమ్మేందుకు సౌందర్య సోదరుడు అమర్ నాథ్ నిరాకరించాడని కూడా ఆవ్యక్తి పేర్కొన్నాడు. ప్రస్తుతం జల్ పల్లిలోని గెస్ట్ హౌస్ ను మోహన్ బాబు వాడుకుంటున్నారని, కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, తగిన న్యాయం కల్పించాలని, మోహన్ బాబుపై చర్య తీసుకోవాలని ఆవ్యక్తి ఫిర్యాదులో కోరాడు. కాగా, ప్రమాదం జరిగినప్పుడు ఈ విషయాలేవీ వెలుగులోకి రాలేదు. ఈ ఫిర్యాదుపై ఇంతవరకూ మోహన్ బాబు స్పందించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News