Monday, December 23, 2024

నవీన్ కేసు… హత్య చేసిన తీరును చూసి విస్తుపోయిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: నవీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు హరిహరకృష్ణ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్య చేసేందుకు కొన్ని రోజుల ముందే నిందితుడు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. నిందితుడు పోలీసులకు చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. షాపింగ్ మాల్ లో 2 నెలల క్రితం కత్తి కొనుగోలు చేశాడు. హరిహరకృష్ణ కొన్నాళ్లుగా స్కూటీలో కత్తి పెట్టుకుని తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

హత్య సమయంలో నిందితుడు చేతికి గ్లౌజులు వేసుకున్నాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా దుస్తులు తొలగించాడు. నిందితుడు హరిహరకృష్ణ హత్య చేసిన తీరును చూసి పోలీసులు విస్తుపోయారు. నిందితుడి మానసిక స్థితి గురించి పోలీసులు ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. ఇంత క్రూరంగా చంపడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. క్రైం వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ చూసి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News