Saturday, February 8, 2025

రతన్‌టాటా వీలునామాలో రహస్య వ్యక్తి

- Advertisement -
- Advertisement -

దివంగత పారిశ్రామిక వేత్త రతన్ టాటా అంటే లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు, ఒక మహోన్నత మానవతామూర్తిగా, సమాజసేవకుడిగా పేరు సంపాదించుకున్నారు. అయితే ఆయన వేలకోట్ల ఆస్తిని తన వద్ద పనిచేస్తున్న వారికి, పెంపుడు శునకాలకు ఇస్తూ వీలునామా రాసిన విషయం తెలిసిందే. తాజాగా బయటకు వచ్చిన మరో వీలునామా చూసి ఆయన సన్నిహితులు ఆశ్చర్యపోయారు. అందులో ఓ రహస్య వ్యక్తికి తన ఆస్తిలో రూ. 500 కోట్లు ఇవ్వాలని రతన్‌టాటా పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఆ రహస్య వ్యక్తి జంషెడ్‌పూర్‌కు చెంది ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా అని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. మోహన్ దత్తా ఆరు దశాబ్దాలకు పైగా రతన్‌టాటా దగ్గర నమ్మకంగా పనిచేశారు. తాజ్‌గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో 2013 నుంచి మోహన్‌దత్తాకు చెందిన “స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ” కలిసి పనిచేస్తోంది. దత్తా కుమార్తె కూడా టాటా గ్రూపులో పనిచేసింది. 2015 వరకు తాజ్‌హోటల్‌లో తరువాత టాటా ట్రస్ట్‌ల్లో 2024 వరకు పనిచేసింది. టాటా గ్రూప్‌నకు చెందిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ,

మోహన్‌దత్తా టాటా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారు. రతన్‌టాటా మరణించినప్పుడు దత్తా ఆయనతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ రతన్‌టాటా 24 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ తనకు తెలుసని అన్నారు. తాను జీవితంలో ఎదగడానికి ఆయన ఎంతో సాయం చేశారని గుర్తు చేసుకున్నారు. డిసెంబర్ 2024లో ముంబై లోని ఎన్‌సిపిఏ లో నిర్వహించిన రతన్‌టాటా జన్మదిన వేడుకలకు దత్తాను ఆహ్వానించినట్టు సమాచారం. రతన్‌టాటా మరణానంతరం బయటకు వచ్చిన వీలునామాలో మూడు దశాబ్దాలుగా తనవద్ద పనిచేస్తూ తోడుగా ఉన్న వ్యక్తిగత సహాయకులు రాజన్ షా, సుబ్బయ్య, పెంపుడు శునకం టిటో పేర్లను చేర్చినట్టు సమాచారం. టాటాకు ఉన్న దాదాపు రూ. 10,000 కోట్ల ఆస్తులు, ఆయన నెలకొల్పిన ఫౌండేషన్‌లకు , సోదరుడు జిమ్మీటాటాకు, సోదరికి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతన్ నాయుడు,తన సహాయకులు, ఇతరులకు చెందుతాయని అందులో రాసినట్టుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News