ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించడంపై ఆనందంగా ఉంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌తో రూపొందే ఈ తెలుగు, -తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “దిగ్గజ స్టార్ అజిత్ కుమార్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను.
దర్శకుడు అధిక్ రవిచంద్రన్ స్క్రిప్ట్, కథనం అద్భుతంగా వున్నాయి. అభిమానులు, సినిమా ప్రేమికులకు గ్రిప్పింగ్, ఆకట్టుకునే సినిమాటిక్ అనుభవాన్నిఅందించడానికి మేము సంతోషిస్తున్నాము”అని అన్నారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ ”ప్రతి ఒక్కరి జీవితంలోనూ, కెరీర్లోనూ అమూల్యమైన క్షణాలు ఉంటాయి. ఇది నా జీవితంలో అద్భుతమైన క్షణం. నా మ్యాట్నీ ఐడల్ ఏకేతో కలిసి పనిచేయడం నా చిరకాల కల. ఈ సినిమాతో ఆ కల నేరవేరడం ఆనందంగా ఉంది”అని తెలిపారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రీకరణ ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం 2025 పొంగల్‌కు విడుదల కానుంది.