Monday, December 23, 2024

మియాపూర్ లో బోర్డు తిప్పేసిన మరో రియల్ ఎస్టేట్ సంస్థ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో మెత్రి ప్రాజెక్టు పేరుతో మియాపూర్ కేంద్రంగా వ్యాపార కార్యకలపాలు నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్ధ సామాన్య, మధ్యతరగతి ప్రజలను నిండా ముంచేసింది. సుమారు 300 మంది నుంచి దాదాపుగా రూ. 50 కోట్లు సేకరించి బాధితులను రోడ్డున పడేశారు. వివరాలలోకి వెళితే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం గుంటూర్‌కు చెందిన జానీ భాషా షేక్ తండ్రి మహమ్మద్ జాకీర్ రామంతాపూర్ లతితాస్ వినయ్ స్కై సిటీ ప్లాట్ నెం. 505లో నివాసం ఉంటున్నారు. మియాపూర్‌లోని అల్వీన్ చౌరస్తాలో మైత్రి ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్‌కు లేదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లో వివిధ వెంచర్ల పేరుతో రాయల్ లీఫ్. గాగిలాపూర్, రాయల్ ప్యారడైజ్ రామేశ్వర్‌బండ, రాయల్ మింట్ మామిడిపల్లి, హాంప్టన్ పామ్స్ మామిడిపల్లి ఓపెన్ ప్లాట్లు అమ్ముతామని దొంగ పత్రాలు అగ్రిమెంట్లు చూపించి డబ్బులు తీసుకున్నాడు. ఈవిధంగా ఒక్కొక్కరి నుంని రూ. 25లక్షల వరకు కట్టించుకుని పెట్టుబడి పెట్టిన వారు ప్లాట్లు అడిగితే ఏదో ఒక సాకు చూపి మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. చివరికు మకాం మార్చి పారిపోయాడు. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు మియాపూర్ అల్విన్ చౌరస్తాలో ఉన్న కార్యాలయంలో ధర్నా చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు పెట్టుబడి పెట్టిన వారంతా మధ్య తరగతి, దిగువ తరగతికి చెందిన వారే ఉన్నారు. వారంతా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News