Thursday, January 23, 2025

మణిపూర్ సిఎంగా రెండోసారి బిరేన్ సింగ్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్.బిరేన్ సింగ్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇది మణిపూర్‌కు ఆయన రెండోసారి సిఎం కావడం. బిరేన్ సింగ్ ప్రమాణస్వీకారోత్సవానికి బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా హాజరయ్యారు. దీనికి బిరేన్ ట్విట్టర్ ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలావుండగా బిరేన్ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మణిపూర్‌కు పార్టీ కేంద్ర పరిశీలకురాలిగా ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త సిఎంగా బిరేన్ సింగ్‌నే ఆదివారం ప్రకటించారు. ఆమె ఆ రాష్ట్ర శాసనసభ్యులతో సమావేశం అయ్యాక ఎన్. బిరేన్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. మణిపూర్‌లోని 60 స్థానాల్లో 32 స్థానాలను బిజెపి గెలుచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News