Monday, December 23, 2024

సెప్టెంబర్ నుండి ‘ఎన్ 62’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరో అల్లరి నరేష్ తన 62వ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘ఎన్62’ చిత్రా న్ని సుబ్బు మంగదేవి దర్శకత్వంలో హాస్య మూవీ స్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. నరేష్ పుట్టినరోజు సందర్భంగా యూనిక్ స్టైల్ కాన్సెప్ట్ వీడి యో ద్వారా చేసిన అనౌన్స్ మెంట్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా కథ చాలా యూనిక్‌గా వుంటుంది.

ఇందులో నరేష్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీ తం అందిస్తున్నారు. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్‌గా పని చేస్తున్నారు. హీరో భావోద్వేగ ప్రయాణంలో సాగే ఈ కథ 1990 నేపథ్యంలో ఉంటుంది. సెప్టెంబర్ చివరి నుంచి షూట్‌ను ప్రారంభిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News