Monday, December 23, 2024

సైబరాబాద్ పోలీసులకు ఎన్95మాస్కులు

- Advertisement -
- Advertisement -
N95 masks for Cyberabad police
లక్ష మాస్కులు అందజేసిన ఎస్‌సిఎస్‌సి

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న పోలీసులకు ఎస్‌సిఎస్‌సి లక్ష ఎన్ 95మాస్కులను అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌సిఎస్‌సి జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల మాస్కులను సిపి స్టిఫెన్ రవీంద్రకు అందజేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో పోలీసులు ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్‌సిఎస్‌సి జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల అన్నారు. ప్రతి పోలీసుకు కనీసం పదిమాస్కులను అందజేశామని తెలిపారు. మాస్కులు మాత్రమే కరోనా రాకుండా అడ్డుకోగలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ సిపి అవినాష్ మహంతి, ఎడిసిపి రియాజ్, ఎడిసిపి రవికుమార్, ఎసిపిలు, ఎస్‌హెచ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News