Monday, December 23, 2024

నా పేరు సీసా…

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, రవితేజ టీం వర్క్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ‘నా పేరు సీసా’ అంటూ సాగే థర్డ్ సింగిల్ జూలై 2న విడుదల కానుంది. తాజాగా ఈ పాట ప్రోమో లాంచ్ చేశారు.

సామ్ సిఎస్ మాస్ డ్యాన్సింగ్ నెంబర్‌గా కంపోజ్ చేసిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటలో అన్వేషి జైన్ గ్లామరస్‌గా కనిపించారు. శ్రేయా ఘోషల్, సామ్ సిఎస్ ఫుల్ ఎనర్జీటిక్‌గా ఈ పాటని ఆలపించారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Naa Peru Seesa song out from ‘Ramarao On Duty’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News