Monday, December 23, 2024

‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ రిలీజ్..

- Advertisement -
- Advertisement -

మరోసారి సంక్రాంతి పోరుకు సిద్ధమయ్యారు కింగ్ నాగార్జున. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘నా సామిరంగ’. ఈ మూవీని షాట్ పిరియడ్ లో కంప్లీట్ చేసి సంక్రాంతికి రచ్చ చేసేందుకు వచ్చేస్తున్నాడు నాగ్. తాజాగా ఈ మూవీని సంక్రాంతికి కానుకగా జనవరి 14 గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ షూరూ చేశారు.

ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ను ఆదివారం విడుదల చేశారు. మాస్ బీట్ తో కలర్ ఫుల్ గా ఉన్న ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్.. ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది.

కాగా.. ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘బంగార్రాజు’ చిత్రాలను కూడా గతంలో సంక్రాంతి పండుగ సమయంలో విడుదల చేసి నాగార్జున హిట్ కొట్టారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో 2024 సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాను బరిలో దింపుతున్నారు నాగార్జున.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News