Monday, December 23, 2024

జెఎన్‌టియుహెచ్ జగిత్యాల ఇంజనీరింగ్ కాలేజీకి న్యాక్ ‘ఎ’ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

NAAC 'A' Accreditation for JNTUH Jagtial Engineering College

 

మనతెలంగాణ/హైదరాబాద్ :జెఎన్‌టియుహెచ్ యూనివర్సిటీకి చెందిన జగిత్యాలలోని ఇంజనీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మక న్యాక్ ఎ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఈ మేరకు అధికారులు జెఎన్‌టియుహెచ్‌కు ఈమెయిల్ ద్వారా సమాచారం అందజేశారు. జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని జెఎన్‌టియుహెచ్ ఇంజనీరింగ్ కాలేజీని నెల 19,20 తేదీలలో త్రిసభ్య న్యాక్ పర్యవేక్షణ బృందం రెండు రోజులపాటు పర్యవేక్షించింది. ఆ కాలేజీని న్యాక్ ఎ గుర్తింపు వచ్చినట్లు మంగళవారం న్యాక్ అధికారులు ప్రకటించారు. ఈ గుర్తింపు ఐదు సంవత్సరాల వరకు వర్తిస్తుందని కళాశాల ప్రిన్సిపల వి.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. తమ కాలేజీకి న్యాక్ ఎ గ్రేడ్ గుర్తింపు రావడానికి కృషి చేసిన ఐక్యూఎసి కో ఆర్డినేటర్, విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాలలోని జెఎన్‌టియుహెచ్ ఇంజనీరింగ్ కాలేజీకి న్యాక్ ఎ గుర్తింపు లభించడం పట్ల వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నర్సింహ్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ఆయా కాలేజీ అధికారులకు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News