Sunday, December 22, 2024

‘ఆర్ఆర్ఆర్’ దేశాన్ని గర్వపడేలా చేసింది: కీరవాణి

- Advertisement -
- Advertisement -

లాస్ ఏంజెల్స్: 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటునాటు’ పాటను ఆస్కార్ వరించింది. కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కీరవాణి ఆస్కార్ అకాడమీకి కీరవాణి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ దేశాన్ని గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని కీరవాణి పేర్కొన్నారు. అటు గీత రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ అభివాదం తెలిపారు. నాటునాటు పాట ఆస్కార్ వేదికపై గెలుపుబావుటా ఎగురవేసింది. నాటునాటు పాటకు ఆస్కార్ రావడంపై తెలుగు చిత్ర అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News