Sunday, January 19, 2025

బాలికపై హెడ్ మాస్టర్ మరో ఉపాధ్యాయుడు అత్యాచారం…..

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: 11 సంవత్సరాల విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారం చేసిన సంఘటన ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విద్యార్థిని (11) ఐదో తరగతి చదువుతోంది. బాత్రూమ్‌కు వెళ్లిన బాలికపై ప్రధానోపాధ్యాయుడు మరో టీచర్‌తో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. కడుపులో నొప్పి వస్తుందని బాలిక ఇంట్లో పడిపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. బాలికపై లైంగిక దాడి జరిగిందని వైద్యులు తెలపడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం మరో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరు ఉపాధ్యాయులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News