Saturday, November 16, 2024

తెలంగాణ అభివృద్ధిలో నాబార్డ్ ముఖ్య భూమిక

- Advertisement -
- Advertisement -

చిగురుమామిడి : తెలంగాణ అభివృద్ధిలో నాబార్డ్ యొక్క ముఖ్య భూమిక ఆజాదికా అమృత్ మహోత్సవంను గురువారం పెద్ద ఎత్తున నిర్వహించినట్లు జన వికాస్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ సిఈవో పెండ్లి సంపత్ కుమార్ సుందరగిరిలో తెలిపారు. ఆజాది కా అమృత్ మహోత్సవాన్ని ఉద్దేశించి నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్. జయప్రకాష్ మాట్లాడుతూ నాబార్డ్ ద్వారా తెలంగాణలో ట్రైబల్ డెవలప్‌మెంట్ ఫండ్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఎస్‌ఎస్‌జి మహిళల కోసం ఎంఈడిపి, ఎల్‌ఈడిపితో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుందని అన్నారు.

దీంతో పాటు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీలకు నాబార్డ్ ద్వారా సబ్సిడి స్కీమ్‌లతో లోన్ గ్రాంట్‌లను అందించడం జరుగుతుందని అన్నారు. మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంపొందించుకొనుటకు వారికి గ్రామీణ మేళాల ద్వారా మార్కెటింగ్ లో సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం పద్మ, వెలుగు రేఖ, రూరల్ డెవలప్‌మెంట్ సిఈవో రజిత, జన వికాస్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ సిఈవో పెండ్లి సంపత్ కుమార్, ప్రతినిధి పెసరి రాజు, ఎస్‌హెచ్‌జి మహిళలు, మహిళా రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News