- Advertisement -
హైదరాబాద్: ఈ ఏడాది వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ లో నాబార్డు స్టేట్ క్రెడిట్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహానికి ముందుకు రావాలని, రాయితీల ద్వారా ప్రోత్సాహానికి నాబార్డు ముందుకు రావాలని భట్టి కోరారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడంలో నాబార్డుది కీలకపాత్రని తెలియజేశారు. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
- Advertisement -