Thursday, January 23, 2025

కమర్షియల్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

Nachindi girlfriend movie

యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మధునందన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నాడు. శ్రీరామ్ ఆర్ట్ బ్యానర్‌పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఉగాది పండుగ సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ టైటిల్ పోస్టర్ చూస్తే…హీరోయిన్ కు రోజ్ ఫ్లవర్ ఇస్తూ లవ్ ప్రపోజ్ చేస్తున్న కథానాయకుడిని వద్దని వారిస్తున్నాడు అతని స్నేహితుడు. ఈ పోస్టర్‌తో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనే ఆసక్తి కలుగుతోంది. సుమన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్‌గా చూపించబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News