ఇన్ఫోసిస్ డిజిటల్ గ్లోబల్ బ్రాండ్ అంబాసీడర్‌గా మూడేళ్ల ఒప్పందం
న్యూఢిల్లీ : టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్‌కు మరో అరుదైన అవకాశం లభించింది. చాలా కాలంగా ఆటకు దూరంగా ఉంటున్న రఫా మరోమారు అభిమానులను అలరించనున్నా డు. మైదానంలో ఆటతో కాందండోయ్.. ఓ కంపెనీకి ప్రచారకర్తగా అభిమానులకు కనువిందు చేయచనున్నాడు. ప్రముఖ ఇన్ఫోసిస్ డిజిటల్ గ్లోబల్ బ్రాండ్ అంబాసీడర్‌గా మూ డేళ్ల పాటు కొనసాగనున్నాడు. కాగా, నాదల్ ఓ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఈ అవకాశాన్ని అందుకునందుకు నాదల్ సంతోషా న్ని వ్యక్తం చేశారు.
Also Read: పంచాంగాన్ని నమ్ముకోండి: పోలీసులకు యుపి డిజిపి క్లాసు !(వైరల్ వీడియో)
‘టెన్నిస్ అభిమానులందరికీ నమస్కారం. ఇన్ఫోసిస్ డిజిటల్ గ్లోబల్ కంపెనీ టీమ్‌లో చేరడానికి చాలా అతృతగా ఎదురుచూస్తున్నా. ఇక్కడా నా ప్రయాణం చా లా ఆనందంగా సాగుతుందని నమ్ముతున్న’ అని నాదల్ ట్విట్టర్‌లో తన ఖాతాలో పోస్ట్ చే శాడు. తొడ కండరాల కారణంగా పలు గ్రాం డ్‌స్లామ్ టోర్నీలకు దూరమైన మట్టికోర్టు రా రాజు నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఫెదరర్(21) అధిగమించి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. కాగా, ఇటీవలె ఈ రికార్డును సె ర్బియా స్టార్ నోవాక్ జొకోవిక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గడం ద్వారా నాదల్ రికార్డును బద్దలు కొట్టాడు.