Monday, December 23, 2024

ఆటకు ఫెదరర్ గుడ్‌బై.. కన్నీళ్లు పెట్టుకున్న నాదల్

- Advertisement -
- Advertisement -

Nadal tears at Roger Federer farewell to Tennis

లండన్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేశాడు. లేవర్ కప్ డబుల్స్ విభాగంలో ఫెదరర్ యూరప్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థి రఫెల్ నాదల్ (స్పెయిన్)తో కలిసి డబుల్స్ బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌నాదల్ జోడీకి ఓటమి ఎదరైంది. దీంతో ఫెదరర్ తన కెరీర్ మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. టీమ్ యూరప్ తరఫున బరిలోకి దిగిన నాదల్‌ఫెదరర్ జోడీ అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ తియాఫో, జాక్ సాక్ జంటతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌తో ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు తెరపడింది. ఇక కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను ఆడిన స్విస్ దిగ్గజానికి అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. సహచర ఆటగాళ్లు ఫెదరర్‌ను చేతుల్లో ఎత్తుకుని మైదానంలో ఊరేగించారు. ఈ క్రమంలో ఫెదరర్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతరం అయ్యాడు. మరోవైపు ఫెదరర్‌ను చూసిన చిరకాల ప్రత్యర్థి నాదల్ కూడా బోరును ఏడ్చేశాడు. ఇటు నాదల్, ఫెదరర్ కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మైదానంలో నువ్వానేనా అన్నట్టు తలపడే నాదల్‌ఫెదరర్ నిజజీవితంలో అప్తమిత్రులుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తన చిరకాల ప్రత్యర్థి ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకడంతో నాదల్ బోరున విలపించాడు. ఫెదరర్‌పై నాదల్‌కు ఉన్న ప్రేమకు అభిమానులు నీరాజనం పలికారు.

Nadal tears at Roger Federer farewell to Tennis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News