Monday, December 23, 2024

నా వ్యాఖ్యలు బాధిస్తే క్షమించండి

- Advertisement -
- Advertisement -

 

 

ఇజ్రేలీ దర్శకుడు లాపడ్ వివరణ

న్యూఢిల్లీ: కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే అందుకు పూర్తిగా క్షమాపణ చెబుతున్నానని ఇజ్రేలీ సినీ దర్శకుడు నాడవ్ లాపిడ్ ప్రకటించారు. కశ్మీరీ పండిట్లను కాని కశ్మీరీ బాధితులను కాని అవమానించాలన్నది తన ఉద్దేశం కాదని ఆయన తెలిపారు. ఇటీవల జరిగి భారతదేశ జాతీయ చలనచిత్రోత్సవాలకు అంతర్జాతీయ జ్యూరీ చైర్మన్‌గా వ్యవహరించిన లాపిడ్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని అసభ్యకర, ప్రచార చిత్రంగా ఆయన వర్ణించారు. బుధవారం రాత్రి ఒక జాఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాపిడ్ మాట్లాడుతూ చిత్రాన్ని నిర్మించిన తీరును మాత్రమే తాను విమర్శించానని తెలిపారు. ఎవరినీ అవమానించడం తన ఉద్దేశం కాదని, బాధితులను కాని వారి కుటుంబ సభ్యులను కాని అవమానించడం తన ఉద్దేశం కాదని, ఒకవేళ వారు ఆ విధంగా అర్థం చేసుకుంటే తాను పూర్తిగా క్షమాపణ చెబుతున్నానని ఆయన తెలిపారు.

గత వారం గోవాలో జరిగిన ఉత్సవాల అనంతరం స్వదేశానికి వెళ్లిపోయిన ల్యాపిడ్ న్యూస్ ఛానల్‌లో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, తానే కాక తన తోటి జ్యూరీ సభ్యులు సైతం కశ్మీర్ ఫైల్స్‌ను ఒక అసభ్యకర ప్రచార చిత్రంగానే పరిగణిస్తున్నారని అన్నారు. ప్రతిష్టాకరమైన పోటీ విభాగంలో ఆ చిత్రానికి స్థానం ఉండడం సబబు కాదన్నది తమ అభిప్రాయమని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News