Sunday, January 19, 2025

మోడీ ‘ఏక్ హై తో సేఫ్ హై’ ఐక్యత గురించి మాట్లాడుతూ రాహుల్‌పై నడ్డా ఎదురుదాడి

- Advertisement -
- Advertisement -

నవీ ముంబై: నరేంద్ర మోడీ, గౌతమ్ అదానీలపై రాహుల్ గాంధీ దాడి చేసిన కొన్ని గంటల తర్వాత, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని ‘ఏక్ హై తో సేఫ్ హై’ అని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం అందరి ఐక్యత, శ్రేయస్సు అని నొక్కి చెప్పారు.

“మోడీ ‘ఏక్ హై తో సేఫ్ హై’ అంటే దేశంలో ఐక్యత ఉంటే అందరూ సురక్షితంగా ఉంటారని అర్థం. మేము అందరినీ వెంట తీసుకెళ్తున్నాము” అని నడ్డా సోమవారం జరిగిన మహా యుతి ర్యాలీలో తెలిపారు.  ఈ ర్యాలీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా పాల్గొన్నారు.

“విలేకరుల సమావేశాలలో సైతం గాంధీ ఒంటరిగా ఉన్నారు. అతని మహా వికాస్ అఘాడి సహచరులు కూడా అతనితో లేరు, ఎందుకంటే అతను ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే అతను సురక్షితంగా ఉంటాడు ”అని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి నడ్డా ఎదురు దాడిలో అన్నారు.

గాంధీ తన ర్యాలీలు, సమావేశాలలో భారత రాజ్యాంగం యొక్క పాకెట్ వెర్షన్‌ను ప్రదర్శించడంపై నడ్డా మాట్లాడుతూ “ఇప్పుడు గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు… అతను రాజ్యాంగాన్ని చదవలేదు… ఎందుకంటే రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు’’ అని వ్యాఖ్యానించారు.

“నేను నా పార్టీని రద్దు చేస్తాను కానీ కాంగ్రెస్‌తో ఎప్పటికీ రాజీపడను అని బాలాసాహెబ్ ఠాక్రే అన్నారు. నేడు ఉద్ధవ్ ఠాక్రే అధికారం కోసం కాంగ్రెస్ ఒడిలోకి వెళ్లిపోయారు. మీరు రాజీపడిన విధానాన్ని మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు’’ అన్నారు.

“మోడీ హయాంలో, మహాయుతి, ఎన్ డిఏ  కొత్త సంస్కృతిని, రాజకీయాలకు కొత్త నిర్వచనాన్ని సృష్టించాయి. నేడు మన ప్రభుత్వం ‘చెప్పింది చేసింది, చెప్పనిది కూడా చేసింది,” అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News