ఆదిభట్ల: బిఆర్‌ఎస్ పార్టీ యువనేత మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి (బంటి) చేపడుతున్న యువసమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమనేత, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఇటికాల ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం ఓప్రకటనలో ఆయన మాట్లాడుతూ..బిఆర్‌ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఊహించనిస్థాయిలో అభివృద్ది సాధించిందని అన్నారు. సిఎం కెసిఆర్ సారథ్యంలో భవిష్యత్తులోనూ అదే ఊపు కొనసాగుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదర్శవంతంగా తీర్చిదిద్దబడిందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో ప్రతి పల్లెలోనూ మౌళికవసతుల రూపకల్పన జరిగిందని ఆయన ప్రశంసించారు.
ఊరూరికీ రోడ్లు, ఇంటింటికీ తాగునీరు, ప్రతి పంటకు సాగునీరు, నిరంతరాయ విద్యుత్, వృద్ధాప్య వితంతు దివ్యాంగుల పెన్షన్ అందిస్తూ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న ప్రభుత్వం తమదని ఆయన అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతలకే అన్నంపెట్టే స్థాయిలో అమలవుతున్నాయని ఆయన హర్శం వ్యక్తంచేశారు. యువతకు ప్రయివేటు, ప్రభుత్వ రంగాల్లో ఉపాధీ మార్గాలను చూపుతూ ప్రభుత్వం ముందుకుసాగుతున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువచేసే లక్షంతో బిఆర్‌ఎస్ రాష్ట్ర యువనేత మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి నిర్వహిస్తున్న యువసమ్మేళనం కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని కట్టమైసమ్మ అమ్మవారి ఆలయం నుండి ర్యాలీగా జరుగునున్న ఈసమ్మేళనానికి ప్రజలు, యువతీయువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.