Monday, April 14, 2025

మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతోంది: నాదేండ్ల మనోహర్

- Advertisement -
- Advertisement -

సింగపూర్‌ అగ్నీ ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో ప్రధాని మోడీ మాట్లాడారని.. అవసరమైన సహాయం అందిస్తామని మోడీ చెప్పారని మంత్రి తెలిపారు. “ఈ ప్రమాదంలో పవన్‌ కల్యాణ్‌ రెండో కుమారుడు మార్క్ శంకర్‌ గాయపడ్డారు.ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. మార్క్ శంకర్‌ను కాపాడిన సిబ్బందికి కృతజ్ఞతలు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది” అని తెలిపారు.

కాగా, సింగపూర్‌లోని ఓ స్కూల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఈ స్కూల్ లోనే చదువుకుంటున్న పవన్, ఎనిమిదేళ్ల రెండో కుమారుడు మార్క్ శంకర్‌ చేతులు, కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురైన మార్క్ శంకర్‌.. సింగపూర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ సింగపూర్‌ వెళ్లే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News