Monday, December 23, 2024

జనసేనలోకి బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా..?

- Advertisement -
- Advertisement -

గుంటూరు: బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పిసిసి అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. దీంతో ఎపిలో కన్నా-నాదెండ్ల భేటీపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. సోము వీర్రాజు నాయకత్వంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ..జనసేన రోడ్ మ్యాప్ విషయంలో కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే సోము వీర్రాజును తీరును ఖండించారు.

బుధవారం నాదెండ్ల మనోహర్, కన్నా లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లి సమావేశం కావడంతో…కన్నాను నాదెండ్ల మనోహర్ జనసేనలోకి ఆహ్వానించబోతున్నారా?, రెండు పార్టీల మధ్య గ్యాప్ పై చర్చించుకుంటారా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే బీజేపీని వీడబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా నాదెండ్లతో భేటి అయిన నేపథ్యంలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News